సిద్ధార్థలో గ్రాడ్యుయేషన్‌ డే | - | Sakshi
Sakshi News home page

సిద్ధార్థలో గ్రాడ్యుయేషన్‌ డే

May 20 2026 12:11 AM | Updated on May 20 2026 12:11 AM

నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మంగళవారం గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సుదర్శనరావు పాల్గొని పాస్‌ అవుట్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మెడల్స్‌, పట్టాలను అందజేశారు. కళాశాల ఆడిటోరియంలో జరిగిన కాన్విగేషన్‌ డే సమావేశంలో కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ అశోకరాజు మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతి విద్యను అందివ్వడానికి కృషి చేస్తున్నామన్నా రు. 17 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నామినీస్‌ ప్రశాంతి, అ రుణక్రాంతి, ప్రిన్సిపల్‌ మధు, జనార్దరాజు, నా మిని ఫ్రొఫెసర్‌ పద్మసువర్ణ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్జామినర్‌ విజయభాస్కర్‌, గోపి, హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ రవాణా

కలువాయి(సైదాపురం): వెంకటరెడ్డిపల్లి రిజర్వ్‌ఫారెస్ట్‌లోని కుల్లూరు పెయ్యాలతిప్ప ప్రభుత్వ భూ ముల్లో గ్రావెల్‌ తవ్వి, వందల ట్రాక్టర్లతో అక్రమంగా తరలించి, అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు మామూళ్లు అందడంతో ఏ ఒక్కరు గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను అడ్డగించే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా గ్రావెల్‌ దోపిడీ ఎప్పు డు చూడలేదని స్థానికులు అంటున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి కలువాయి మండలంలో జరుగుతున్న గ్రావెల్‌ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement