తిరుపతి సిటీ: రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య వేదిస్తోంది. పేదలు కొనుగోలు శక్తిని కొల్పోయి పూటగడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ సకాలంలో అందక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. విద్యను కార్పొరేట్ రంగం శాసిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ విద్యావ్యస్థ నిర్వీర్యమైంది. ఎన్నికల సమయంలో బాబు అండ్ కో ఇచ్చిన హామీలు అధికారం చేపట్టాక తుంగలో తొక్కేశారు. జిల్లాలో లక్షల మంది యువతీయువకులు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేక దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కుటుంబంలోని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి నెలకు రూ.1500, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్న హామీ గాలికొదిలేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పిల్లలను కనండి.. జనాభాను పెంచుకుందాం. మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు వ్యాఖానించడం దారుణం అంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా వారు ఎమన్నారంటే వారి మాటల్లోనే..


