22 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

22 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

May 20 2026 12:11 AM | Updated on May 20 2026 12:11 AM

తిరుపతి సిటీ: ఏపీ పీజీసెట్‌ –2026 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీయూలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఉదయం 9 గంటల నుంచి 5 వరకు జరగనున్న ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధిత విద్యార్థులు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సంబంధిత జాతీయ, రాష్ట్ర స్థాయి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలన కోసం తప్పక తీసుకురావాలని తెలిపారు. అలాంటి సర్టిఫికెట్లకు మార్కులు కేటాయించామని, విద్యార్థులు హాజరు కాకపోతే వారి ర్యాంక్‌ కోల్పోతారని వెల్లడించారు.

ఎస్వీయూలో ఐఐఎం

స్టూడెంట్‌ చాప్టర్‌ ప్రారంభం

తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటల్స్‌ స్టూడెంట్‌ అఫిలియేట్‌ చాప్టర్‌ను ప్రారంభించారు. వర్సిటీ సెనేట్‌ హాల్‌ వేదికగా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి వీసీ నర్సింగరావు, హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఎస్వీయూలో ఐఐఎం స్టూడెంట్స్‌ అఫిలియేట్‌ చాప్టర్‌ ప్రారంభించడంతో వర్సిటీ మరో మైలురాయిని చేరుకుందన్నారు. మెటీరియల్‌ సైన్‌న్స్‌లో పరిశోధన, ఇంజినీరింగ్‌ రంగంలో శాసీ్త్రయత, ఆవిష్కరణలకు ఇది ఎంతగానో ఊతమిస్తుందని చెప్పారు. విద్యార్థులు తమ విద్య, వృత్తిపరమైన అభివృద్ధికోసం, పరిశోధన, విజ్ఞాన వేదికల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఐఎం కౌన్సిల్‌ సభ్యులు ఎన్‌ఎఫ్‌సీ చైర్మన్‌ డాక్టర్‌ కోమల్‌ కపూర్‌, మిశ్రా ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ డాక్టర్‌ నారాయణమూర్తి, బ్రహ్మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జైతీర్త్‌ ఆర్‌ జోషి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎస్‌ మంజిని, ఐఐఎం స్టూడెంట్‌ కో–ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ పి హేమ, ప్రొఫెసర్‌ వి దివాకర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement