బిడ్డలను కంటే నగదు ప్రోత్సాహం ఇస్తామని సీఎం అత్యంత దారుణంగా మాట్లాడారు. బిడ్డని కంటే ఉద్యోగం ఇస్తాం..వారి భవిష్యత్తు బాధ్యత నాదే అని భరోసా ఇచ్చినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి తప్ప పేదలను రెచ్చగొట్టి కాలయాపన చేస్తే ప్రజలు అమాయకులు కాదు. ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరు.
– ఆర్ ఆషా, పీడీఎస్‌ఓ, జిల్లా కార్యదర్శి, తిరుపతి
●
ఇచ్చిన హామీలు నెరవేర్చండి
ఉన్న సంతానాన్ని చదివించలేక పేదలు అప్పుల పాలవుతున్నారు. మళ్లీ మాయ మాటలు చెప్పి పేదలను రెచ్చగొట్టడం దారుణం. సీఎం చంద్రబాబు కొత్తగా బిడ్డలను కనండి డబ్బులు ఇస్తామంటూ దారుణంగా మాట్లాడటం అభ్యంతరకరం. మహిళలను ఆట వస్తువులుగా చూడటమేంటి. మహిళలకిచ్చిన ఆడబిడ్డనిధి హామీకి చరమగీతం పాడేశారు. పేదలకు భరోసా ఇవ్వాలికాని ఇలా మాయమాటలు చెప్పడం దారుణం.
– పవిత్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు, తిరుపతి
ఆయన మాటల్లోనే హేళన కనిపిస్తోంది
సీఎం చంద్రబాబు ప్రజల నుద్ధేశించి మాట్లాడిన తీరు బాగోలేదు. బిడ్డలను కనండి డబ్బులు ఇస్తా మని ఆయన నవ్వుతూ మాట్లాడిన తీరు బాధాకరం. పేద కుటుంబాల్లోని యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక అల్లాడుతోంది. బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఫీజురీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి మాట ఎత్తకుండా మళ్లీ పిల్లలను కనండంటూ మాయ మాటలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. – ప్రేమ్ కుమార్,
వైఎస్సార్‌సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షులు, తిరుపతి


