సీఎం చంద్రబాబు ఇటీవల ప్రజలనుద్ధేశించి దారుణంగా మాట్లాడారు. ఎక్కువ మందిని కనండంటూ మాట్లాడం అభ్యంతరకరం. ఉన్నవారికి ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. యువత పరిస్థితి దారుణంగా ఉంది. నిరుద్యోగ భృతి లేదు, ఆడబిడ్డనిధికి చరమగీతం పాడారు. బిడ్డను కంటే రూ.30 వేలు ఇస్తే వారి భవిష్యత్తు భరోసా ఏమిటి. ఇలాంటి మభ్యపెట్టే మాటలను ఆయన మానుకోవాలి. – బండి చలపతి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి
డైపర్స్‌కు చాలవు బాబూ!
పిల్లలను కంటే డబ్బులు ఇస్తామని ప్రజలను హేళన చేసి మాట్లాడటం బాధాకరం. యువతకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాత ఉచిత సలహాలు ఇవ్వాలి. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ. 40 వేలు ఇస్తే ఆ నగదు కేవలం పిల్లల డైపర్స్ కూడా చాలవు. వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలవా. ఇలాంటి మాటలతో పేద ప్రజలను మభ్యపెట్టడం దారుణం. ప్రభుత్వాల వ్యవహారశైలితో ఇద్దరు బిడ్డలున్న పేదలు వారిని పూర్తిస్థాయిలో పెంచలేక అవస్థలు పడుతుంటే సీఎం ఇలా మాట్లాడటం అభ్యంతరకరం. – సుందర్‌రాజు,
ఎన్‌ఎల్‌ఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు, తిరుపతి


