భారీగా ఇసుక అక్రమ డంపింగ్‌ | - | Sakshi
Sakshi News home page

భారీగా ఇసుక అక్రమ డంపింగ్‌

May 20 2026 12:11 AM | Updated on May 20 2026 12:11 AM

కుల్లూరులో ఇసుక అక్రమ డప్పింగ్‌

కలువాయి(సైదాపురం): ధనార్జనే ధ్యేయంగా కూటమి నాయకుల కనుసన్నల్లో ఇసుకాసురులు పెన్నానది నుంచి వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలించి కలువాయి మండలంలోని కుల్లూరు నేషనల్‌ హైవే పక్కన డంపింగ్‌ చేశారు. అర్ధరాత్రులు భారీగా టిప్పర్లు ద్వారా డంపింగ్‌ చేస్తున్నారు. అధికారులకు భారీగా ముడుపులు అందుతుండడంతో ఇటు వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొనిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ డపింగ్‌ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement