గడ్డివామి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గడ్డివామి దగ్ధం

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

● గత 28వ తేదీన హత్య చేసినట్టు పోలీసుల నిర్ధారణ

వరదయ్యపాళెం: మండలంలోని శ్రీసిటీ పరిధి తొండూరులో కండ్రిగ ధనశేఖర్‌కు చెందిన గడ్డి వామి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. పాడి పశువులకు మేత కోసం ఇటీవలే దాదాపు 200 మోపుల గడ్డిని కొనుగోలు చేసి ఇంటి ఆవరణలో వామి ఏర్పాటు చేశాడు. ఆదివారం మధ్యాహ్నం గడ్డివామికి మంటలు వ్యాపించడంతో గమనించి స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు.. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చదువుతోపాటు క్రీడలపై

దృష్టి పెట్టాలి

తిరుపతి రూరల్‌: విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన చదువుతోపాటు క్రీడలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సూచించారు. ఆదివారం శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో రాజు విద్యాసంస్థలు, అలెన్‌ సంయుక్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు మెగా ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌, టీటీడీ అడిషనల్‌ ఈఓ వెంకయ్య చౌదరి, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ అనురాగ్‌ యాదవ్‌, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ చరణ్‌ రుద్రరాజు, రాజు విద్యాసంస్థల చైర్మన్‌ చమర్తి జగన్మోహన్‌రాజు, అలెన్‌ సౌత్‌ ఇండియా హెడ్‌ మహేష్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారు.

విద్యుత్‌ షాక్‌తో

యువకుడి మృతి

రామచంద్రాపురం: మండలంలో పరమాల గ్రామంలో విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. ఆదివారం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో ఒక నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. గంగిరెడ్డిపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్‌(35) అలియాస్‌ అలీ ఎయిర్‌టెల్‌ డిష్‌ టీవీ మెకానిక్‌. మిట్ట కండ్రిగ పంచాయతీ పరమాల గ్రామంలో ఓ ఇంటికి డిష్‌ అమర్చేందుకు వెళ్లిన హరిప్రసాద్‌ పనిలో నిమగ్నమై ఉండగా విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. స్థానికులు 108 వాహనంలో కుప్పం బాదూరు గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించే నేపథ్యంలో సి.రామాపురం వద్ద ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మతుడికి భార్య కుమారి, కుమార్తెలు గుణశ్రీ, వేదశ్రీ ఉన్నారు. దీంతో గొల్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బయటపడ్డ యువకుని

మృతదేహం

చంద్రగిరి: రామిరెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 28ఏళ్ల వయస్సు కలిగిన ఓ యువకుని మృత దేహం కుళ్లిన స్థితిలో బయటపడింది. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి నగరంలో ట్యాక్సీ డ్రైవర్‌ శ్రీనివాసులు తన స్నేహితులతో కలసి గత నెల 28వ తేదీన మద్యం తాగేందుకు తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తనపల్లి వద్దకు వెళ్లారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం బీరు బాటిళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. అదే సమయంలో శ్రీనివాసులుపై మద్యం మత్తులో ఉన్న స్నేహితులు బీరు సీసాలతో దాడి చేసి, హత్య చేశారు. అతను చనిపోవడంతో గుట్టుగా ఆ మృతదేహాన్ని చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి వద్దనున్న ఓ ప్రైటు కాలేజీ సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. శ్రీనివాసులు కనిపించడం లేదని అతని తమ్ముడు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 2వ తేదీన అదృశ్యం కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి వద్ద గుర్తు తెలియని యువకుడి మృత దేహం బయటపడినట్టు తెలియడంతో అతని కుటుంబీకులను అక్కడకు తీసుకువెళ్లారు. మృత దేహం గుర్తు పట్టలేని విధంగా కుళ్లిపోయి ఉండడంతో అతను ధరించిన దుస్తుల ఆధారంగా శ్రీనివాసులుగా అతని సోదరుడు ప్రభాకర్‌ గుర్తించాడు. మృత దేహానికి శవపరీక్ష నిర్వహించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు సిబ్బంది నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement