తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆస్పత్రి శస్త్ర చికిత్స విభాగం, మెడ్ ట్రానిక్స్– అభిషేక్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘ల్యాప్రస్కోపిక్‌లో అధునాతున పద్ధతులు.. శస్త్ర చికిత్స’ అనే అంశంపై రుయాలో ఆదివారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో వివిధ వైద్య కళాశాలల నుంచి విచ్చేసిన పీజీ వైద్య విద్యార్థులకు ల్యాప్రోస్కోపిక్‌ను ఉపయోగిస్తూ, శస్త్రచికిత్సలకు కుట్లు వేయడం, స్టాప్లర్‌ను వినియోగించి రక్తస్రావం లేకుండా చేయడం, శస్త్ర చికిత్సలు చేయడంలోని మెలకువలు, దాని వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ శస్త్రచికిత్స మెలకువల విధానాలను ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ.రవిప్రభు, రుయా ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ బీ.మనోహర్, శస్త్ర చికిత్స విభాగాధిపతి డాక్టర్ సుధాకర్ వివరించారు. ఈ వర్కషాపులో ఏఎస్‌ఐఏవీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ ఫణిమహేష్‌రెడ్డి, సభ్యులు డాక్టర్ జీవి ప్రకాష్, డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ నరేష్ పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 మొబైల్ నంబరుకు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని సీఎండీ కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


