నేటితో ముగియనున్న స్పోర్ట్స్‌మీట్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో ఈనెల 14వ తేదీ నుంచి జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగియనుంది. ఇక్కడ చెస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ ఐఐటీల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో తలపడుతున్నారు.
చెస్: చెస్ ఈవెంట్‌లో ఆరు గ్రిప్పింగ్ రౌండ్ల తర్వాత, ఐఐటీ బాంబే ప్రస్తుతం 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 15.5 పాయింట్లతో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 14పాయింట్లతో ఐఐటీ పాట్నా, ఐఐటీ వారణాసి కూడా పోటీలో ఉన్నాయి. ఆదివారం జరగనున్న చివరి రౌండ్‌తో విజేత ఎవరన్నది తేలనుంది.
టెన్నిస్ (మహిళలు)
టెన్నిస్ మహిళల విభాగంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఐఐటీ పాట్నా మూడో స్థానంలో నిలిచింది.
టెన్నిస్ (పురుషులు)
పురుషుల టెన్నిస్ పోటీ సెమీఫైనల్ దశకు చేరుకుంది, ఇందులో ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే జట్లు సె మీఫైనల్‌కు చేరాయి. కాగా ఆదివారం ముగింపు ఉత్సవాలు, షీల్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ డీన్ ప్రొఫెసర్ అశ్విన్ మహాలింగం ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
నేటితో ముగియనున్న స్పోర్ట్స్‌మీట్


