దర్జాగా విద్యుత్ చౌర్యం
సాక్షి టాస్క్ ఫోర్సు: ఓ భవన నిర్మాణ పనుల్లో కళ్ల ఎదుటే నేరుగా విద్యుత్ స్తంభం నుంచి వైరు లాగి భవన నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్, నీటి మోటర్, తదితర పరికరాలకు విద్యుత్ వినియోగించుకుంటున్నా విద్యుత్ శాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలలోకి వెళితే.. గూడూరు జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఏర్పాటైన కాశీ లేఅవుట్‌లో ప్రభుత్వ పెద్దలు ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు త్రీఫేజ్ విద్యుత్ కనెక్షన్ తీసుకుని మీటరు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అందులో నుంచి విద్యుత్‌ను భవన నిర్మాణ పనులకు వినియోగించుకుంటే అధికంగా బిల్లులు చెల్లించాల్సి వస్తుందని భావించిన భవన యజమాని తన భవన నిర్మాణానికి సమీపంలోనే ఉన్న విద్యుత్ స్తంభానికి నేరుగా విద్యుత్ వైర్‌ను వేసి విద్యుత్ చౌర్యం పాల్పడుతున్నారు. అయితే అధికారులు అటు వైపు కన్నెతి కూడా చూడక పోవడం విశేషం. భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న విద్యుత్ చౌర్యాన్ని ఆ శాఖ డీఈఈ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా టౌన్ ఏఈని పంపి పరిశీలిస్తామని తెలిపారు.


