సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
తిరుపతి రూరల్: ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాలులో శనివారం ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్‌న్స్ ఎగ్జిబిషన్‌ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సీఎండీ శివశంకర్ శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్‌లో 50కి పైగా నమూనాలను ఏర్పాటు చేశారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా సంస్థ పరిధిలో నిర్వహించిన క్విజ్, వక్తృత్వపు పోటీలు, సైనన్స్ ఎగ్జిబిషన్‌లో స్టాళ్ల ఏర్పాటు తదితర పోటీల్లో విజేతలకు ఈనెల 21వ తేదీన రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు కె. గురవయ్య, పి. అయూబ్‌ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, జె.రమణాదేవి, పీహెచ్. జానకిరామ్, ఎం.ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం


