రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఓసీ పల్లి హైస్కూల్
పాకాల:జిల్లా స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఓసీ పల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం సి.కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ వడమాలపేట జెడ్పీ హైస్కూల్(బాలుర) పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఓసీపల్లి జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి కె.రాజశేఖర్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయు లు విద్యార్థి రాజశేఖర్‌కి అభినందనలు తెలిపారు.


