మా ఇంటి దీపం వెలిగించాడు!
శాంతిపురం: ‘‘నాకున్న 1.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుని భార్య జయంతి, కొడుకు పృథ్విఆదిత్యతో ఉన్నంతలో సంతోషంగా జీవించేవాడిని. మూడేళ్ల క్రితం నా కొడుకు ఆనారోగ్యానికి గురయ్యాడు. నెల రోజుల పాటు మేము ఆస్పత్రుల చుట్టూ తిరిగితే ఊపిరి తిత్తులు తీవ్రమైన ఇన్పెక్షన్‌కు గురైనట్టు తేల్చారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గురించి తెలిసినా, నా బిడ్డ ఎదుర్కొంటున్న జబ్బుకు చికిత్సలు చేసే ఆస్పత్రులు స్థానికంగా లేక ఇబ్బంది పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో వైద్యం కోసం చేసిన ఖర్చులు తమ శక్తికి మించి అయిన వారి సాయం తీసుకున్నా అదీ సరిపోలేదు. నానాటికీ అనారోగ్యం ముదురుతూ శ్వాస తీసుకోవడానికి అల్లాడుతున్న నా చంటి బిడ్డను చూస్తూ ఉండలేక సతమతమయ్యారు. చివరకు బెంగళూరులోని రెయిన్‌బో అస్పత్రికి తీసుకువెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించారు. రూ.10 లక్షలకు పైగా విలువైన చికిత్సలను ఉచితంగా అందించడంతో పృథ్విఆదిత్య గండం నుంచి గట్టెక్కాడు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పట్లో తమ కష్టాన్ని, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని తలుచుకుని ధర్మేంద్ర దంపతులు చేతులు జోడించి నాటి సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. మా లాంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి మంచి మనసున్న పాలకులే కావాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.’’
– ధర్మేంద్ర, ఆరిముత్తనపల్లి, శాంతిపురం మండలం


