పేదలకు చైతన్య వారధి అంబేడ్కర్
తిరుపతి కల్చరల్: దేశంలో పెనవేసుకుపోయిన కులవ్యవస్థ మాసిపోవాలని పోరాడిన వ్యక్తి అంబేడ్కర్ బారత దేశంలోని పేదలకు చైతన్య వారధి అని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి ఆయన ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ నాగరికత ఏర్పడిన తరువాత ఉన్నతమైన వ్యక్తి అంబేడ్కర్ అని తెలిపారు. మానవుల్లో అత్యంత మేధావిగా, పేద ప్రజల జీవితాలను పరిపూర్ణంగా మార్చిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కట్టా గోపియాదవ్, ఎస్సీ విభాగం నేతలు తలారి రాజేంద్ర, నల్లానిబాబు, అజయ్, దేవదానం, కల్లూరి చెంగయ్య, విజయలక్ష్మి, మాధురి, శాంతారెడ్డి,మద్దాలి శేఖర్, రమణారెడ్డి. ధనశేఖర్ పాల్గొన్నారు.


