హోంగార్డు సేవలు ప్రశంసనీయం
తిరుపతి క్రైమ్: హోంగార్డు సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హోంగార్డు వ్యవస్థ స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఏర్పడిందని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో ఒక భాగమని హోంగార్డ్స్ ప్రజలకు పోలీసులకు వారధిగా పనిచేయాలని సూచించారు. 26 ఏళ్లగా పోలీసులతో ఏమాత్రం తీసిపోని విధంగా వీరంతా సేవలందిస్తున్నారన్నారు. హోంగార్డు సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటామని, వారికి ఏ విధమైన సాయం కావాలన్న తనని నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. వారి కుటుంబీకులు ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహర్ ఆచారి, శ్రీనివాసులు, రామకృష్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అంబేడ్కర్‌కు నివాళి
అంబేడ్కర్‌కు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


