ఇన్ఫోసిస్‌కి ‘శ్రీరామ’ విద్యార్థులు
తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు. శనివారం ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు పాఠ్యాంశాలు బోధిస్తున్నారని వెల్లడించారు. ఎంపికై న విద్యార్థులను అభినందించారు. కళాశాల డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు పాల్గొన్నారు.
14 మంది ఎస్‌ఐలకు బదిలీల అటాచ్‌మెంట్లు
తిరుపతి క్రైమ్: జిల్లాలో పనిచేస్తున్న 14 మంది ఎస్‌ఐలకు బదిలీలు ఇస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం ఆదేశాలు జారీ చేశారు. సుదీర్ఘంగా పనిచేస్తున్న ఎస్‌ఐలను బదిలీలు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. వీరందరూ కూడా బదిలీ స్థానాల్లో త్వరలోనే బాధ్యతలు స్వీకరించినన్నారు.
బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం
తిరుమల: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే భక్తులు శనివారం బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు దాతలు హైదరాబాద్‌లోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడికి చెక్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
ఇన్ఫోసిస్‌కి ‘శ్రీరామ’ విద్యార్థులు


