ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం

Dec 7 2025 7:18 AM | Updated on Dec 7 2025 7:18 AM

ఫ్లైఓ

ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం

పీజీ తొలిసెమిస్టర్‌ ఫలితాలు విడుదల

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ బోటనీ, మ్యాథ్స్‌, రెగ్యులర్‌ ఎంఏ మొదటి సెమిస్టర్‌ ఆర్కియాలజీ, హిస్టరీ, పాపులేషన్‌ స్టడీస్‌, సోషల్‌ వర్క్‌, సంస్కృతం, లింగ్విస్టిక్స్‌ , ఉర్దూ, హ్యూమన్‌ రైట్స్‌, ఉమెన్‌ స్టడీస్‌ విభాగాల ఫలితాలను విడుదల చేసినట్లు డీన్‌ ఆచార్య సురేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి క్రైమ్‌: నగరంలో శనివారం రాత్రి గరుడ వారధి ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కథనం మేరకు.. మానస సరోవర్‌ సమీపంలోని శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న తోట పుష్యమిత్ర (26)కు ఏమైందో ఏమో గానీ శనివారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని గరుడ వారధి పైనుంచి కిందకు దూకేశాడు. ఈ క్రమంలో పుష్యమిత్ర కింద వెళుతున్న కారుపై పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా కారు కూడా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ యువకుడిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం1
1/1

ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement