చంద్రబాబుకు ఏ వర్గంపై కూడా ఆపేక్ష లేదు
● ఆయనవన్నీ అవకాశవాద రాజకీయాలు ● అధికారంలోకి వచ్చాక రైతుల గురించి పట్టించుకోలేదు ● బాబు మర్చిపోయినా జగన్ మా పక్షాన పోరాడుతున్నాడంటున్న మహిళలు
సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్లల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కానీ ప్ర చార్భాటంలో మా త్రం హంగామా చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షు లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. ఆయనకు ఏ వర్గంపైన కూడా ఆపేక్ష లేదు. వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబే స్వయంగా చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల్ని గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సీఎం చంద్రబాబు మనల్ని మర్చిపోయినా వైఎస్ జగన్ మాత్రం మనల్ని గుర్తు పెట్టుకుని మా పక్షాన పోరాడుతున్నాడని మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు మా ట్లాడుకుంటున్నారు. ఎంతో కష్టపడి మన హయాంలో కుప్పం నియోజకవర్గానికి నీళ్లిస్తే ఆరోజున కాలువలో కూర్చుని చంద్రబాబు ధర్నా చేశాడు. రైతులు నీళ్లొద్దు అనుకుంటున్న సమయంలో చంద్రబాబు నీళ్లు తీసుకుపోయి నేనే నీళ్లిచ్చా, చెరువులు నింపానని ప్రచారం చేసుకుంటున్నాడు.’’ అని అన్నారు.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు గడువు పొడిగింపు
తిరుపతి సిటీ: 2026–27 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూళ్లలో 6, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల సమర్పణ గడువును నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించారని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత డాక్టర్ యన్.విశ్వనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష జనవరి 18వ తేదీన జరుగుతుందని తెలిపారు. అర్హతలు, పరీక్షా విధానం గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు వరదరాజనగర్‌లోని విశ్వం కోచింగ్ సెంటర్‌లోగానీ, 86888 88802, 93999 76999 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
10న కార్తీక కోటి దీపోత్సవం
తిరుపతి కల్చరల్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మపరిషత్ సౌజన్యంతో తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు రామచంద్ర పుష్కరిణి వద్ద కార్తీక కోటి దీపోత్సవం నిర్వహించన్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక కోటి దీపోత్సవంలో భాగంగా సాయంత్రం 4.45 గంటలకు గణపతి పూజ, శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీగరుడ, నవగ్రహాల అభిషేకం, మరకత లింగం, నందీశ్వరుల అభిషేకం, సామూహికంగా మూల మంత్రంతో మహా మృత్యుంజయ హోమం, చండీ హోమం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.


