 
															పునరావాసాల్లో 648 మంది ఆశ్రయం
చిల్లకూరు: మోంథా తుపాన్ కారణంగా వరద ప్రవాహ ప్రాంతాల్లోని బాధితులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో రెవెన్యూ శాఖ అధికారులు ఆశ్రయం కల్పించారు. గూడూరు నియోజక వర్గంలో తుపాన్ కారణంగా రెండు రోజుల పాటు పునరావాసాల్లో 648 మందికి ఆశ్రయం కల్పించారు. ఇందులో భాగంగా గూడూరు మండలంలో ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాల్లో ఒక చోట 39 మంది, మరో చోట 19 మందికి ఆశ్రయం కల్పించారు. వీరికి రెవెన్యూ శాఖ ద్వారా భోజన వసతి కల్పించారు. చిల్లకూరు మండలంలో 8 ప్రాంతాల్లో పునరావాసాలు ఏర్పాటు చేసి 209 కుటుంబాలకు గాను 509 మందిని ఆయా కేంద్రాల్లో వసతి కల్పించారు. స్థానికంగా ఉండే పరిశ్రమల యాజమాన్యాలు, నాయకుల సహాయ సహకారాలతో భోజన ఏర్పాట్లు చేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎక్కడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
