ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు | - | Sakshi
Sakshi News home page

ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు

Oct 31 2025 9:26 AM | Updated on Oct 31 2025 9:28 AM

మరమ్మతులకు నగదు డిమాండ్‌ చేస్తున్న ట్రాన్స్‌కో సిబ్బంది

ఏర్పేడు: శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం సమీపంలోని పొలాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్‌ స్తంభాలు పక్కకు వాలిపోయి విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. దీంతో రైతులు మరమ్మతులు చేయించాలని విద్యుత్‌ శాఖ సిబ్బందికి విన్నవిస్తున్నా వారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలోని రైతులందరూ కలసి కొంత మొత్తం ఇస్తే మరమ్మతులు చేస్తామని ట్రాన్స్‌కో సిబ్బంది డిమాండ్‌ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అసలే గత సీజన్‌లో పండించిన పంటకు గిట్టుబాటు లేకుండా నష్టపోతే, వర్షాలకు పాడైన ట్రాన్స్‌ఫార్మర్లు, కూలిన విద్యుత్‌ స్తంభాలను బాగు చేయాల్సిన ట్రాన్స్‌కో సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేయడం దారుణమని రైతులు ఆక్రందనకు గురవుతున్నారు.

దళితుడిపై దాడి కేసు విచారణ

బాలాయపల్లి(సైదాపురం): దళితులు సాగు చేసుకుంటున్న భూమిని తెలుగుదేశం పార్టీ చెందిన సీసీ నాయుడు ఆక్రమించుకుంటుండగా అడ్డుకున్నందుకు దళితుడిపై దాడి చేసి ఘటనపై గురువారం డీఎస్పీ గీతా కుమారి విచారణ చేపట్టారు. బాధితులు కథనం మేరకు.. వెంగమాంబపురం గ్రామం టీడీపీ నేత సీసీ నాయుడు అక్కసముద్రం రెవెన్యూ పరిఽధి లోని సర్వే నంబర్‌ 1లోఉన్న ప్రభుత్వ భూమిని గత 10 ఏళ్లు క్రితం నుంచి చదును చేసి, వర్షాధార పంటలు సాగు చేసుకుంటున్న జీవనం సాగించేవారమన్నారు. మహిళా అని చూడకుండా పరుష పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని కన్నీరు పెట్టుకుంది. దీంతో డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని చెప్పారు. ఆమె వెంట ఎస్‌ఐ గోపీ తదితరులు ఉన్నారు.

సమాజాభివృద్ధిలో యువతదే ప్రధాన పాత్ర

తిరుపతి సిటీ: సమాజాభివృద్ధిలో యువతదే ప్రధాన పాత్ర అని, యువత విలువలతో క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్‌ నర్సింగ్‌రావు అభిప్రాయపడ్డారు. గురువారం వర్సిటీ సెనేట్‌ హాల్‌లో జరిగిన విజిలెన్స్‌ వీక్‌ అవగాహన వారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ యువత పారదర్శకత, బాధ్యత, నిజాయితీ తదితర విలువలను ఆచరించాలని సూచించారు. దేశాభివృద్ధికి యువత మూల స్తంభాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు, ద న్యూ ఇండియా అస్యూరెన్‌న్స్‌ కంపెనీ లిమిటెడ్‌ చీఫ్‌ బిజినెస్‌ మేనేజర్‌ పీఎస్‌ లత, కల్చరల్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ పత్తిపాటి వివేక్‌, డిప్యూటీ మేనేజర్‌ సాయి గురుగోవింద్‌, అసిస్టెంట్‌ మేనేజర్లు నంద స్వరూపరెడ్డి పాల్గొన్నారు.

ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు 1
1/3

ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు

ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు 2
2/3

ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు

ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు 3
3/3

ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement