వైభవంగా విగ్రహప్రతిష్ట పూజలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా విగ్రహప్రతిష్ట పూజలు

Oct 31 2025 9:26 AM | Updated on Oct 31 2025 9:26 AM

వైభవం

వైభవంగా విగ్రహప్రతిష్ట పూజలు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో గురువారం ఆగమోక్తంగా అత్తివరదరాజస్వా మి విగ్రహ ప్రతిష్ట పూజలు చేశారు. అగ్ని ప్ర ణయనం, మహాశాంతి అభిషేకం నిర్వహించారు. ఆలయాధికారులు, పాలకమండలి స భ్యులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం ఉద యం అగ్ని ప్రణయనం, కుంభారాధన, సర్వగాయత్రి హోమం జరగనుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రేణిగుంట: మండలంలోని వెదళ్లచెరువు సమీపంలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ ర హదారిపై ద్విచక్ర వాహనాన్ని వెనుకవైపు నుంచి ఆటో ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అర్బన్‌ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి మండ లం, కలవ గుంట ఎస్టీకాలనీకి చెందిన గిలకల వెంకటరమణయ్య (38) అదే గ్రామానికి చెంది న గంగాధర్‌తో కలిసి గురువారం కోడూరుకు వెళ్లడానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరా డు. వారు రేణిగుంట సమీపంలోని వెదళ్లచెరు వు వద్ద వెళుతుండగా శ్రీకాళహస్తి వైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఆటో ద్విచక్ర వాహనాన్ని వెనుకవైపు ఢీ కొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణయ్య తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించా రు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 2 కంపార్ట్‌మెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉ న్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 64,048 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 19,838 మంది భక్తులు తలనీలాలు అర్పించా రు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.0 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

వైభవంగా విగ్రహప్రతిష్ట పూజలు 
1
1/1

వైభవంగా విగ్రహప్రతిష్ట పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement