 
															వెంకటగిరి రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి
వెంకటగిరి రూరల్: వెంకటగిరిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని నేదురు మల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటగిరి మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన గూడూరు, నాయుడుపేట, ఏర్పేడు, శ్రీకాళహస్తికి మండలాలకు కేంద్రబిందువుగా ఉందని, ఈ మేరకు వెంకటగిరి మున్సిపాలిటీ, వెంకటగిరి రూరల్, బాలాయపల్లి, డక్కిలి మండలాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ తరుఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న వెంకటగిరిని రెవె న్యూ డివిజన్ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కృషి చేయాలని, ప్రజా అభిప్రాయ సేకరణ జరపి, ప్రభుత్వానికి నివేదకలను సమర్పించాలని సూచించారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు నివేదికలను సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, విప్ పూజారి లక్ష్మి, ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి సదానందరెడ్డి, కౌన్సిలర్లు కందాటి కళ్యాణి, ధనియాల రాధ, ఆటంబాటం శ్రీనివాసులు, నాయకులు దశరధరామిరెడ్డి, కల్లు సతీష్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
