కొర్లగుంటలో కార్డన్ సర్చ్
తిరుపతి క్రైమ్: కొర్లగుంటలో ఈస్ట్ పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సుమారు 40 మంది సిబ్బంది పాల్గొని ప్రతి ఒక్కరూ డీటెయిల్స్‌ను సేకరించారు. పది మంది రౌడీషీటర్ల ఇళ్లు తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను గుర్తించి, సరైన ఆధారాలను చూపించిన అనంతరం వారిని విడుదల చేశారు. అదేవిధంగా 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను సీజ్ చేశారు. వాటికి జరిమానా విధించి వదిలేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని చుట్టుపక్కల ప్రజలకు తెలిపారు.
ఆర్టీసీ బస్సులో బంగారం, నగదు పోగొట్టుకున్న మహిళ
నాగలాపురం: మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో 3 సవర్ల బంగారు, రూ.5 వేల నగదు పోగొట్టుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెల్లూరు గ్రామానికి చెందిన లేట్. చెంగమ నాయుడు భార్య నీలమ్మ(62) శనివారం ఉదయం తమిళనాడులోని తిరువళ్లూరులో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం తిరువళ్లూరు నుంచి బస్సులో నాగలాపురం బయలుదేరింది. ఊత్తుకోటలో నాగలాపురానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఉచిత ప్రయాణం కోసం తన ఆధార్ కార్డును పర్సు నుంచి తీసి కండక్టరుకు చూపించింది. రద్దీ ఎక్కువగా వుండడంతో కారణి వరకు నిలబడి ప్రయాణించింది. నాగలాపురం బస్టాండులో దిగిన తరువాత తన బ్యాగులో ఉన్న పర్సు కనిపించలేదు. బస్సులో పడి ఉండవచ్చని, అందులో 3 సవర్ల బంగారు, రూ.5 వేలు నగదు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
కొర్లగుంటలో కార్డన్ సర్చ్


