
తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమల : తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో తప్పిపోయిన వారిని గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మానిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సామరా్‌థ్య్‌న్ని పెంచాలని సూచించారు. రియల్ టైమ్‌లో వ్యక్తుల గుర్తింపు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగించాలని ఆదేశించారు. అనంతరం ఈవో లగేజీ కౌంటర్‌ను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ –2 కు చేరుకుని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. తనిఖీల్లో ఈవో వెంట సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేపు బ్రహ్మర్షి ఆశ్రమానికి మారిషష్ ప్రధాని
రామచంద్రాపురం : మండలంలోని శ్రీ సిద్ధేశ్వర బ్రహ్మర్షి ఆశ్రమాన్ని మారిష్ ప్రధాని సందర్శించనున్నారు. సోమవారం సిద్ధగురువర్ శ్రీ సిద్ధేశ్వర బ్రహ్మర్షి గురుదేవుల దివ్య ఆశీస్సులు పొందునున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. విదేశీ ప్రధాని రాకతో శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రత్యేక పోలీస్ నిఘా వర్గాలతో కలిసి ఆశ్రమంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు