
వైఫల్యాల ‘జాతర’
కూటమి జాతరగా మార్చేసిన వైనం అడుగడుగునా అపశ్రుతులే క్యూలైన్లలో కల్పించని సౌకర్యాలు ఇబ్బందులు పడ్డ చిన్నపిల్లలు, వృద్ధులు కూటమి నేతలకే దర్శన భాగ్యం ఇదీ వెంకటగిరి జాతర తీరుతెన్నులు
వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరలో ఆది నుంచి అన్నీ తప్పిదాలతో ముగిసింది. అమ్మవారి జాతర ప్రధాన ఘట్టాలైన జాతర అనుమతి (తాంబులం స్వీకరణ) నుంచి జాతర ముగిసే వరకు అడుగడుగునా వైఫల్యాలతో జన జాతర రాజకీయ జాతరగా ముగిసింది. 2023వ సంవత్సరంలో రాష్ట్ర పండుగగా ప్రకటించిన జాతరను అప్పటి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో జాతరను ఐదు రోజుల పండుగలా హంగులు, ఆర్భాటాలతో నిర్వహించారు. రెండేళ్లుగా జరుగుతున్న పోలేరమ్మతల్లి జాతరలో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం గగనమైంది. ఈ ఏడాది ప్రత్యేకంగా కూటమి నేతల కనుసన్నల్లో జాతర నిర్వహణ జరగడంతో రాజకీయ జాతరగా మిగిలిపోయింది.

వైఫల్యాల ‘జాతర’

వైఫల్యాల ‘జాతర’