
నిరసనలు
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై
భాకరాపేట: కూటమి ప్రభుత్వం కుట్రలో భాగమే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. ఎర్రావారిపాళెం మండల కేంద్రంలో శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. చెవిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే తప్పుడు కేసులు నమోదు చేయించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. చెవిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోహిత్‌రెడ్డిపై పెట్టిన కేసును కూడా ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, పాకాల, తిరుపతి రూరల్, రామచంద్రాపురం ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

నిరసనలు