శ్రీకాళహస్తిలో డ్రగ్స్ కలకలం
శ్రీకాళహస్తి: పట్టణంలోని రెండవ పట్టణంలో డ్రగ్స్ కలకం సృష్టిస్తోంది. ఏవీఆర్ పాఠశాల వెనుక ఐదుగురు యువకులు ప్రతిరోజూ మద్యం సేవించి గొడవ పడుతుండడాన్ని గమనించిన స్థానికులు శుక్రవారం సాయంత్రం వారిని తరిమేయడానికి ప్రయత్నించారు. వారు పారిపోయారు. ఒక యువకుడు ద్విచక్ర వాహనాన్ని వదిలేవసి వెళ్లిపోవడంతో దాన్ని రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. తీరా అక్కడ పరిశీలించగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు తేలింది. డ్రగ్స్ బాటిళ్లు, సిరంజీలు, గంజాయి బీడీలు కనిపించడంతో అవాక్కయారు. శ్రీకాళహస్తిలో గంజాయి, మద్యం మాత్రమే దొరుకుతుందని అనుకున్న స్థానికులు శుక్రవారం డ్రగ్స్ బాటిళ్లను చూసి భయపడుతున్నారు. దీనిపై రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లగా వారి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాహనం ఎవరి పేరుతో ఉందో తెలుసుకుని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.


