సమష్టిగా పోరాడుదాం
పెళ్లకూరు : కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న కుట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఐకమత్యంగా ఉండాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. శనివారం తిరుపతి నుంచి నెల్లూరు వెళుతున్న ఆయన మార్గ మధ్యలో చిల్లకూరు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ ప్రిస్కిల్లా, సర్పంచ్ హరిబాబురెడ్డిని ఆయన సత్కరించారు. కక్ష పూరిత రాజకీయాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని వాటికి దూరంగా ఉంటూ పార్టీ కేడర్‌ను బలోపేతం చేసుకొనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, మురళి, శ్రీనివాసులు, మోహన్‌రెడ్డి, మోహన్, వినోద్‌రెడ్డి, సుధాకర్, జనార్దన్‌రెడ్డి, జితేంద్ర, బాలు, గోపాల్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


