ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష
తిరుపతి అర్బన్ : డీఎస్సీ పరీక్షలకు తొలి రోజే 126 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం 4 కేంద్రాల్లో మాత్రమే ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్షలు చేపట్టారు. కలెక్టర్ వెంకటేశ్వర్‌తో పాటు డీఈవో కేవీఎన్ కుమార్ కరకంబాడీ రోడ్డులోని అన్నమాచార్య ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఉదయం జరిగిన సెషన్స్‌కు 573 మందికి 509 మంది మాత్రమే హజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన సెషన్స్‌కు 570 అభ్యర్థులకు 508 మంది హాజరయ్యారు. తొలి రోజు తిరుపతిలోని అన్నమాచార్య కళాశాల , పుత్తూరులోని శ్రీవెంకటేశ్ పెరుమాళ్ కళాశాల, గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, విద్యానగర్ ఎన్‌బీకేఆర్ కళాశాలలో మాత్రమే రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 30 వరకు డీఎస్పీ పరీక్షలకు సంబంధించి 33,607 మంది అభ్యర్థులు సెషన్స్‌ల వారీగా పరీక్షలు రాయాల్సి ఉంది.
● తొలిరోజు 126 మంది గైర్హాజరు
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష


