
కుట్రపూరితంగా కాకాణిపై కేసు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేకున్నా అక్రమ మైనింగ్ కేసు నమోదు చేయడం దారుణం. అదే మైనింగ్ వ్యవహారంలో 2023లో విచారణ జరగాక ఎలాంటి అక్రమాలు లేవని అధికారులు ధ్రువీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అదే అధికారి చేత అక్రమాలు జరిగాయంటూ ఇచ్చిన వివరాలతో కాకాణిపై ఏ–4గా కేసు నమోదు చేయడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వ తీరుపై జూన్ 4న వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించనున్నాం. కూటమి దౌర్జన్యాలు, అరాచకాలు, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, దుర్మార్గాలు ప్రజలు దృష్టికి తీసుకెళ్తాం.
– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
●