పరాకాష్టకు ‘కూటమి’ కుయుక్తులు
మైనింగ్ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి బెయిల్ వస్తే ఏ–4 మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని దురుద్దేశపూర్వకంగా జైలుకు పంపారు. ఆయనపై నమోదు చేసిన కేసులో బలం లేకపోవడంతో కక్షపూరిత ధోరణితో ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. దీంతోపాటు మైనింగ్‌లో బ్లాస్టింగ్ చేశారని కేసులు నమోదు చేయడం ఆశ్చర్యమేస్తోంది. సైదాపురం మండలంలో ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్, అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్న విషయాలను రాత్ర పూర్వకంగా కలెక్టర్, ఎస్పీ, ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం. కానీ వారిపై చర్యలు తీసుకోక పోగా ఎలాంటి సంబంధం లేనివారిపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారు. సమంజసం కాదు. – నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త
●


