తిరుమలలో టీటీడీ ఈఓ తనిఖీలు
తిరుమల : తిరుమలలోని పలు ప్రాంతాలను టీటీడీ ఈఓ శ్యామలారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిలా తోరణం, చక్ర తీర్థంలో చక్రత్తాళ్వార్, నరసింహస్వామి, ఆంజనేయస్వామి ప్రతిమలతోపాటు ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రత, పార్కింగ్‌ను పరిశీలించారు. పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈఓ సోమన్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు.
అదనపు ఈఓ పరిశీలన
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం వేకువజామున క్యూలను తనిఖీ చేశారు. కృష్ణతేజ విశ్రాంతి భవనం వద్ద శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదం. పాలు, తాగునీరు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ ఈఓ (హెల్త్) సోమన్ నారాయణ పాల్గొన్నారు.
తిరుమలలో టీటీడీ ఈఓ తనిఖీలు


