లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని తీర్మానం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : మంత్రి నారా లోకేష్‌ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని తిరుపతిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మినీ మహానాడులో తీర్మానం చేశారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ అద్యక్షతన తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సునీల్ కుమార్, రామకృష్ణ, బొజ్జల సుధీర్‌రెడ్డి, నెలవల విజయశ్రీ తమ నియోజవర్గాల్లో చేసిన తీర్మానాల అంశాలను వివరించారు. తీర్మాణాల అంశాలను వేదిక దృష్టికి తెచ్చారు. టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, మునిరామయ్య, శాప్ చైర్మన్ రవినాయుడు, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు.


