● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో కై కాల చాటింపు ● ప్రత్యేక అలంకరణలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మతల్లి దర్శనం | - | Sakshi
Sakshi News home page

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో కై కాల చాటింపు ● ప్రత్యేక అలంకరణలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మతల్లి దర్శనం

May 7 2025 1:02 AM | Updated on May 7 2025 1:03 AM

‘ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా.. చాటింపుతో నేటి నుంచి తిరుపతి గంగజాతర ప్రారంభమైంది.. వారం రోజుల పాటు తిరుపతిలో గంగజాతర కొనసాగుతుంది.. గనుక నగరవాసులెవ్వరూ ఊరువదలి వెళ్లరాదు.. ఇంతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయరాదు. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించుకోవాలహో...’ అంటూ కై కాల వంశస్థలు తిరుపతి గంగజాతర చాటింపును వేశారు.

తిరుపతి కల్చరల్‌: తిరుపతిలో జాతర సందడి నెలకొంది. గ్రామదేవత తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద కోలాహలం ఏర్పడింది. భేరివీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించారు. అనంతరం నాటి నగర శివారు ప్రాంతాలైన నాలుగు కాళ్ల మండపం, హెడ్‌ పోస్టాఫీస్‌, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నటీ ఆస్పత్రి సర్కిల్‌ ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి డప్పు కొట్టి అష్టదిగ్భంధన చేసి చాటింపు చేశారు. ఆ చాటింపుతో జాతర ఆరంభమైంది.

ఒడిబాల సమర్పణ

తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగ జాతర బుధవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు జరగనుంది. మంగళవారం అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి అభిషేకం, పూజలు చేసి ఒడిబాల సమర్పించారు. అమ్మవారు వజ్రకిరీటం, బంగారు ముఖ కవచం ధరించి భక్తులను అనుగ్రహించారు. పలువురు భక్తులు వెయ్యి కళ్ల దుత్తలు నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పసుపు, కుంకుమ తీసుకొచ్చి కొడిస్తంభం వద్ద పూజలకు సమర్పించారు.

గంగమ్మకు పుట్టింటి సారె

జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అవిలాల నుంచి మంగళవారం రాత్రి సంప్రదాయబద్ధంగా పుట్టింటి సారె తీసుకొచ్చారు. అవిలాలలోని పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఇంటి నుంచి ఆడపడుచుకు సంప్రదాయబద్ధంగా అందించే పుట్టింటి సారెను అవిలాల పొలిమేరలో వెలసిన గంగమ్మ గుడి వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి సారెను అందుకునేందుకు శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఈవో, సిబ్బంది, జాతరలో వంశపారంపర్యంగా కీలపాత్ర పోషిస్తున్న కై కాల వంశీయులు అవిలాల పొలిమేరలోని గంగమ్మ గుడికి చేరుకున్నారు. అక్కడి నుంచి అమ్మవారికి సారెను అందుకుకొని ఊరేగింపుగా శ్రీతాతయ్య గంగమ్మ ఆలయానికి విచ్చేశారు. ఆలయ అర్చకుడు మురళీస్వామి, కై కాల కులస్థులు, అవిలాల గ్రామపెద్దలు పెద్దిరెడ్డి, సురేష్‌, లోకేష్‌, చెంగల్‌రాయులు, వెంకటేష్‌ పిళ్‌లై, తనూజ్‌ పాల్గొన్నారు.

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో  కై కాల చాటింపు ● ప్రత్యేక1
1/4

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో కై కాల చాటింపు ● ప్రత్యేక

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో  కై కాల చాటింపు ● ప్రత్యేక2
2/4

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో కై కాల చాటింపు ● ప్రత్యేక

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో  కై కాల చాటింపు ● ప్రత్యేక3
3/4

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో కై కాల చాటింపు ● ప్రత్యేక

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో  కై కాల చాటింపు ● ప్రత్యేక4
4/4

● అర్ధరాత్రి నగర పొలిమేరల్లో కై కాల చాటింపు ● ప్రత్యేక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement