
మద్యం మత్తులో హల్‌చల్
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): మద్యం మత్తులో ఓ డ్రైవర్ చెలరేగిపోయాడు. అతివేగంగా బొలెరో వాహనాన్ని నడిపి అడ్డొచ్చిన వాహనాల్ని ఢీకొట్టాడు. ఈ ఘటన రేణిగుంటలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరుపతి వైపు నుంచి మంగళవారం రాత్రి 8.30 గంటలకు బొలెరో వాహనం అతి వేగంగా వచ్చి అంబేడ్కర్ విగ్రహం కూడలి వద్ద దంపతులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడడ్కాపై అతివేగంగా వెళ్లి డాక్టర్ జనార్ధన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సర్కిల్‌లో ఆపి ఉన్న తమిళనాడు బస్సును, కారును ఢీకొని అదే వేగంతో దూసుకెళ్లాడు. స్థానికులు వెంబడించడంతో వేణుగోపాలపురం ఊరి నుంచి వడ్డిమిట్ట మీదుగా అతివేగంగా వెళ్లడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంబడించి రేణిగుంట పారిశ్రామిక వాడలో పట్టుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో నిలబడే పరిస్థితుల్లో కూడా లేకుండా ఉండడంతో పోలీసులకు అప్పగించారు.
పిడుగు పడి తాటి చెట్టు దగ్ధం
సూళ్లూరుపేట రూరల్: సూళ్లూరుపేట మండలం, మన్నేముత్తేరి గ్రామంలో మంగళవారం సాయంత్రం తాటి చెట్టుపై పిడుగు పడింది. హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఉరుములు, మేరుపులతో పాటు వర్షం రావడంతో స్థానికులు వణికిపోయారు. తీవ్రమైన ఈదురు గాలులతో భయపడి పోయారు.
మద్యం మత్తులో పడి ఉన్న డ్రైవర్

మద్యం మత్తులో హల్‌చల్