శ్రీవారి దర్శనానికి12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,327 మంది స్వామివారిని దర్శించుకోగా 26,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ప్రతి ఇంటా వెలగాలి
నవమి కాంతులు
తిరుపతి అర్బన్: తెలుగు ప్రజలకు ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి పండుగను ఆదివారం వేడుకగా జరుపుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలను ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.
ఘన నివాళి
తిరుపతి క్రైమ్: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళి అర్పించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.
జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
తిరుపతి అర్బన్: భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో జగ్జీవన్ రామ్ 118 జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. డీఆర్వో నరసింహులుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి12 గంటలు


