పాకాల : ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, స్కూటర్ ఢీకొన్న ఘటనలో స్కూటరిస్ట్ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం.. దామలచెరువు పంచాయతీ ఆజాద్‌నగర్‌కు చెందిన అల్లాఉద్దీన్ కుమారుడు ఆశిక్(20) ద్విచక్ర వాహనంలో దామలచెరువు కుక్కలపల్లి రైల్వేగేటు సమీపంలో పాకాల వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆశిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుదర్శన్‌ప్రసాద్ తెలిపారు.
హుండీ ఆదాయం రూ.28 లక్షలు
రాపూరు: పెంచలకోన క్షేత్రంలోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల్లోని హుండీల ద్వారా రూ.28 లక్షల ఆదాయం లభించినట్టు డీసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శ్రీవారి క్రేన్ మండపంలో గురువారం హుండీ లేక్కింపు చేపట్టారు. హుండీ కానుకలు 28 లక్షల 34 వేల 901 నగదుతోపాటు, బంగారం 80 గ్రాములు, వెండి 1.310 కిలోలు వచ్చినట్టు పేర్కొన్నారు. జిల్లా దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ సుధీర్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
అధిక శబ్దం చేసే
వాహనాలకు జరిమానా
తిరుమల: తిరుమలలో అధిక శబ్దాన్ని కలిగించే వాహనాలకు ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ జరిమానా విధించారు. ఆయన గురువారం వాహనాలను తనిఖీ చేశారు. అధిక శబ్దం చేస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న 35 వాహనాలను గుర్తించామ న్నారు. ఒక్కొక్కరికి రూ.1000ల చొప్పున జరిమా నా వసూలు చేశామన్నారు. తిరుమలలో అధిక శబ్దం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీసీ వద్దకు చేరింది. బుధవారం అర్ధరాత్రి వరకు 75,354 మంది స్వామి ని దర్శించుకున్నారు. స్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.4.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకా లంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవే శ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటరిస్ట్ మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటరిస్ట్ మృతి


