
విద్యార్థులకు సైన్స్‌పై మక్కువ ముఖ్యం
తిరుపతి(అలిపిరి): విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలని డీఈఓ కేవీఎన్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో తిరుపతి బాలోత్సవం సహకారంతో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్‌న్స్ అండ్ టెక్నాలజీ ఇంజినీరింగ్–మ్యాథమేటిక్స్ నమూనాలను ప్రదర్శించారు. ‘వాతావరణ మార్పులు–పర్యావరణం’, ‘మానవజాతి గతిని మార్చిన ఆవిష్కరణలు’ అనే అంశంపై సుమారు 22 లఘునాటికలు ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా డీఈఓ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌న్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ సోము రవికుమార్, దామోదరం తదితరులు పాల్గొన్నారు.