ఉత్కంఠగా చంద్రగిరి ఐపీఎల్‌

విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న  చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, రఘునాథరెడ్డి  - Sakshi

తిరుపతి బులియన్‌

తిరుపతి రూరల్‌ : చంద్రగిరి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. శుక్రవారం జరిగిన పోటీల్లో బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగుతోంది. గ్రామీణ యువత ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వస్తున్న టోర్నమెంట్‌లో క్రీడాకారులు ఉత్సాహంగా తమ ప్రతిభను చాటుతున్నారు. బ్యాట్‌ చేతబట్టి బరిలో దిగిన ప్రతి ఒక్కరూ పరుగుల వర్షం కురిపించారు. ప్రస్తుతం లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిసి, మండలస్థాయి సెమీఫైనల్స్‌కు చేరడంతో ఆటగాళ్లు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పోరాడుతున్నారు.

5 మైదానాల్లో 20 మ్యాచ్‌లు

చంద్రగిరి ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం నుంచి 13 గ్రౌండ్లలో రోజూ 52 మ్యాచ్‌లను నిర్వహిస్తుండగా, ఇప్పటికే కొన్ని మండలాలు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. వందల సంఖ్యలో జట్లు వచ్చిన తిరుపతి రూరల్‌, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాలకు చెందిన జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో సెమీఫైనల్స్‌ రోడ్‌మ్యాప్‌లో ఆలస్యం అయింది. అందువల్లే శుక్రవారం తక్కువ మ్యాచ్‌లు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 గ్రౌండ్లలో 20 మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించారు. ఒక్కో గ్రౌండ్‌ నుంచి నాలుగు మ్యాచ్‌ల చొప్పున 5 గ్రౌండ్లలో 20 మ్యాచ్‌లు జరిపించారు. క్రికెట్‌ పోటీల్లో విజేతలకు టోర్నమెంట్‌ కార్యానిర్వాహక కమిటీ చైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి చేతులు మీదుగా ట్రోఫీలు అందించారు.

ఉత్సాహంగా సెమీస్‌

సెమీఫైనల్స్‌ ఉత్సాహంగా సాగుతున్నాయి. తిరుపతి రూరల్‌ మండలం పాడిపేట పంచాయతీ గోవిందపురం జట్టు, చిగురువాడ ఎలెవన్స్‌ జట్టుతో బరిలోకి దిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గోవిందపురం జట్టు తరఫున ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ గా దిగిన శరణ్య, లోకేష్‌ చివరి వరకు పోరాడి వికెట్‌ నష్ట పోకుండా 129 పరుగులు సాధించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన చిగురు వాడ జట్టు ఓటమిని చవిచూసింది. రామచంద్రాపురం మండలం నుంచి బరిలో దిగిన సి.రామాపురం, రాయలచెరువు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో సి.రామాపురం విజేతగా నిలిచింది.

బంగారం :

24 క్యారెట్లు 10 గ్రాములు రూ.61,770

22 క్యారెట్లు ఒక గ్రాము రూ.5,547

వెండి:

హోల్‌సేల్‌ ధర (కిలో) రూ.73,200

రిటైల్‌ వెండి గ్రాము రూ.75.20

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్‌ తదితరులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా అధికారులు లడ్డూప్రసాదాలతో సత్కరించారు.

తెప్పపై సిరులతల్లి విహారం

యువత అభ్యున్నతే లక్ష్యం

హోరాహోరీగా సాగుతున్న

క్రికెట్‌ మ్యాచ్‌లు

పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న

బ్యాట్స్‌మెన్‌

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top