రాజన్న సంక్షేమ పాలనే అజెండా | Sakshi
Sakshi News home page

రాజన్న సంక్షేమ పాలనే అజెండా

Published Fri, Aug 6 2021 2:57 AM

YS Sharmila Hoisting YSR Telangana Party Flag - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అజెండా అని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాజన్న యాదిలో జెండా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను షర్మిల ఆవిష్క రించారు. కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశ మయ్యారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమానికి చెరగని సంతకం వైఎస్సార్‌ అని చెప్పారు. ఆ మహానేత సంక్షేమ పాలన నుంచే పార్టీ జెండా పుట్టుకొచ్చిందని తెలిపారు. పాలపిట్ట రంగు సంక్షేమాన్ని సూచిస్తుందన్నారు. ఇక నీలి రంగు సమానత్వాన్ని సూచిస్తుందని, సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేడ్కర్‌ నినాదమే పార్టీ సిద్ధాంతమని చెప్పారు.

గ్రామగ్రామాన పార్టీ జెండా ఎగరాలి
‘గ్రామగ్రామాన వైఎస్సార్‌టీపీ జెండా ఎగరేసి సంక్షేమ పాలన మళ్లీ తిరిగి రాబోతుందని అందరికీ చెప్పాలి. వైఎస్సార్‌ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతిఒక్క కుటుంబానికీ వైఎస్సార్‌టీపీ జెండా చేరాలి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం గురించి ప్రజలకు వివరించాలి. ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 5 వరకు జెండా పండుగను ఊరూరా, గ్రామగ్రామాన నిర్వహించాలి. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఆశ్వీర్వదిం చాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాలి..’ అని షర్మిల చెప్పారు.

ప్రజల పక్షాన పోరాడాలి 
‘మనం ప్రజల పక్షాన పోరాడితేనే వారు మనల్ని ఆదరిస్తారు. మనం వారి పక్షాన నిలబడితేనే వాళ్లు మన పక్షాన నిలబడతారు. మన చేతిలో అధికారాన్ని పెడతారు. అందువల్ల నియోజకవర్గాలు, గ్రామాలు, మం డలాల్లోని సమస్యలను సొంత సమస్యలుగా భావించి ప్రజల పక్షాన పోరాటం చేయాలి..’ అని షర్మిల పిలుపునిచ్చారు. జెండా పండు గకు సంబంధించిన ఫొటోలను 83741 67039 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని సూచించారు.

Advertisement
Advertisement