28న యాదాద్రి ఆలయం మూసివేత | Sakshi
Sakshi News home page

28న యాదాద్రి ఆలయం మూసివేత

Published Sun, Oct 22 2023 4:01 AM

Yadadri temple closure on 28th - Sakshi

యాదగిరిగుట్ట: చంద్ర గ్రహణం సందర్భంగా ఈ నెల 28న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయ నున్నారు. గ్రహణం కార ణంగా ఒక్క రోజు ముందు అంటే 27వ తేదీన రాత్రి 7 గంటలకు శరత్‌ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు.

28వ తేదీన సాయంత్రం 4 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు.  ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను మూసివేయ నున్నారు. గ్రహణం పూర్తయిన తరువాత 29వ రోజున ఆలయాన్ని వేకువజామునే తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారు.  

Advertisement
 
Advertisement