వైరల్‌: యమ ‘స్పీడ్‌’గా వెళ్తున్న కామారెడ్డి కలెక్టర్‌ వాహనం.. ఏకంగా రూ.27,580 చలాన్లు!

Viral: Traffic Challans On Kamareddy Collector Vehicle - Sakshi

సాక్షి, కామారెడ్డి: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడంలో అందరూ సమానులే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. నాయకుల నుంచి సామాన్యుల వరకు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇటీవల ట్రాఫిక్‌ నిబంధనలను కఠినతరం చేసిన తెలంగాణ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. దొరికిన వారికి దొరికినట్టు చలానాలు విధిస్తూ హడలెత్తిస్తున్నారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ట్రాఫిక్ పోలీసులు ఏకంగా  కలెక్టర్ వాహనానికే చలనాలను విధించారు.
చదవండి: నెహ్రూ జూలాజికల్‌ పార్కు: సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని...

కామారెడ్డి కలెక్టర్ వాహనం (టీఎస్ 16 ఈఈ 3366) పై భారీ మొత్తంలో ఈ-చలానాలు ఉన్నాయి. 2016 సంవత్సరం నుంచి 2021 ఆగస్టు 20 వరకు ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. ఈ చలానాల ప్రకారం మొత్తం రూ.27,580 జరిమానా కట్టాల్సి ఉంది. ఇన్ని చలానాల్లో అధికంగా 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం. ఇక కలెక్టర్ వాహనంపైనే 28 చనాలు ఉండటంతో సదరు కలెక్టర్ గారి వాహనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ‘మాయా’ మసాజ్‌ సెంటర్లు.. కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపడంతో..

అయితే, కలెక్టర్లు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. కామారెడ్డి కలెక్టర్ కంటే ముందు జనగామ జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాంటి చలాన్లే ఉండేవి.  జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి రెండేళ్లలో (2021, ఆగస్టు 30వ తేదీ వరకు) ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్ కాగా, ఒకసారి ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద జీబ్రా క్రాసింగ్ చేసినందుకు చలానాలు విధించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top