Hyderabad: తాగిన మైకంలో చెత్తబుట్టలో వేసేందుకు యత్నం.. చిన్నారిని రక్షించిన ట్రాఫిక్ హోంగార్డు

సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తాగిన మైకంలో ఓ యాచకురాలు ఏడాదిలోపు వయసున్న చిన్నారిని కోణార్క్ థియేటర్ ముందున్న చెత్తబుట్టలో వేసేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నహోంగార్డు రామకృష్ణకు సమాచారం చేరవేశారు. విషయం తెలుసుకున్న హోంగార్డు.. వెంటనే పరుగులు తీసి చిన్నారిని రక్షించాడు. చిన్నారికి సపర్యలు చేసి తల్లి ఒడికి చేర్చాడు. హోం గార్డు రామకృష్ణ చూపిన మానవత్వానికి పనికి అక్కడున్న స్థానికులు అభినందనలు తెలియజేశారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు