
రాష్ట్రంలో అధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు
మార్చి రెండో వారంలోనే 40 డిగ్రీల కంటే అధికంగా నమోదు
రానున్న మూడు రోజులు ఇదే తరహా వాతావరణం: ఐఎండీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి రెండో వారంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈసారి వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. వాస్తవానికి మార్చి మొదటి వారం నుంచి వేసవి సీజన్‌గా పరిగణిస్తారు.
ఈ క్రమంలో మార్చిలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. కానీ గత రెండ్రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్‌లో సగటు ఉష్ణోగ్రతకన్నా 4.4 డిగ్రీలు అధికంగా, నిజామాబాద్‌లో 3.2, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మంలో 3 డిగ్రీలు అధికంగా నమోదైంది.
మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డు అయింది. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు వేగంగా పెరినట్లు ఐఎండీ తెలిపింది. రానున్న మూడు రోజులు ఇదేతరహాలో వాతావరణం ఉంటుందని వివరించింది.
వడదెబ్బతో కూలి మృతి
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజా పేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి బొల్లారం నర్సమ్మ (55) వడదెబ్బతో మృతిచెందింది. నర్సమ్మ గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిoది. దాహం వేయడంతో నీళ్లు తాగింది. ఆ వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది. నర్సమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment