టీవీవీపీ సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు 

Telangana: TVVP Service Rules Has Been Changed - Sakshi

సవరణ ఉత్తర్వుల నోటిఫికేషన్‌ జారీచేసిన వైద్య, ఆరోగ్యశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో నియామకాలు చేపడుతున్న తరుణంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ) సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు సవరణ ఉత్తర్వులతో నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ విభాగం పరిధిలో నియమించనున్న వైద్యులను సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (జనరల్‌), జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌గా విభజించారు. వీరిని ఎంబీబీఎస్‌ అర్హతతో నియమిస్తారు.

గతంలో సైకియాట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాలను నియమించలేదు. ఇప్పుడు వీటిని కొత్తగా నియామకాల్లో చేర్చారు.

పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్బీ అర్హతలను స్పెషాలిటీ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.

టీవీవీపీలో కొత్తగా నియమితులయ్యే వైద్యులకు కూడా ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం వర్తిస్తుంది.

బీఎస్సీ నర్సింగ్, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసిన అర్హులైన నర్సులను నేరుగా నియమిస్తారు. దరఖాస్తు చేసుకునే నర్సులందరూ రాష్ట్ర నర్సింగ్‌ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.

క్లాస్‌ ఏ పారామెడికల్‌ పోస్టులకు.. సర్టిఫికెట్‌ ఆఫ్‌ రేడియాలజీ అసిస్టెంట్, డిప్లొమా ఇన్‌ రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ ఇమేజియాలజీ, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. వీరందరూ రాష్ట్ర పారామెడికల్‌ బోర్డులో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.

క్లాస్‌ బి పారామెడికల్‌ పోస్టులకు.. ఏడాది అనుభవంతో ఎంఎల్డీ ఒకేషనల్‌/ఇంటర్మీడియేట్‌ (ఎంఎలీ ఒకేషనల్‌), డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు, బీఎస్సీ ఎంఎలీ/ఎంఎస్సీ ఎంఎల్టీ, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌(క్లినికల్‌ పాథాలజీ) టెక్నీషియన్, బ్యాచ్‌లర్‌ ఇన్‌ మెడికల్‌ ల్యాబోరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబోరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్‌ క్లినికల్‌ బయో కెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ)/ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్‌ మెడికల్‌ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్‌ క్లినికల్‌ మైక్రో బయాలజీ ఎంఎస్సీ ఇన్‌ బయోకెమిస్ట్రీ.. పూర్తి చేసిన వారు అర్హులు.

క్లాస్‌ సి పారామెడికల్‌ పోస్టులకు.. డి ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మా డి అభ్యర్థులు అర్హులు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top