
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 459 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 8,06,124 మంది కరోనా బారిన పడగా, 7,96,833 మంది కోలుకున్నట్లు తెలిపింది. మరో 5,180 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందినట్లు పేర్కొంది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 22,193 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 127 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది.