తెలంగాణ: లక్షా 65వేలు దాటిన కరోనా కేసులు | Spike Of 2159 New Cases In Telangana Trolls Above 1lakh 65thousand | Sakshi
Sakshi News home page

తెలంగాణలో లక్షా 65వేలు దాటిన కరోనా కేసులు

Sep 17 2020 10:03 AM | Updated on Sep 17 2020 10:06 AM

Spike Of 2159 New Cases In Telangana Trolls Above 1lakh 65thousand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,159 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,003గా ఉంది. ఇందులో 1,33,555 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 30,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కాగా కరోనాతో 24 గంటల్లో కొత్తగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1005కి చేరింది. కేసుల వారిగా చూస్తే..  జీహెచ్ఎంసిలో 318, కరీంనగర్ లో 127, మేడ్చల్ లో 121, నల్గొండలో 141, రంగారెడ్డి 176, సిద్దిపేటలో 132 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 80.94 శాతంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement