
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడ్డ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్, టిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యేక చికిత్స అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆయా సంఘాల నాయ కులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి కూడా పాల్గొన్నారు. నిమ్స్‌లో ప్రత్యేకంగా 50 పడకలు ఏర్పాటు చేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అందరికీ అక్కడే చికిత్స అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కరోనాతో చనిపోయిన వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ఇచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఆందోళన వాయిదా: డాక్టర్లు, పారామెడికల్ సంఘాల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.