కరోనాపై పోరు.. సింగరేణి జోరు..!

Singareni Collieries Achieved War Against Coronavirus - Sakshi

27 వేల మంది సింగరేణి కార్మికులకు వ్యాక్సినేషన్‌ 

రూ.3.6 కోట్లతో సింగరేణిలో ఐదు ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు 

రూ.5.55 కోట్లతో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, ఇతర ఔషధాలు

సాక్షి, హైదరాబాద్‌/ సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో కోవిడ్‌ను కట్టడి చేసేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం, ప్రభుత్వ యంత్రాంగం, గుర్తింపు యూనియన్‌ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్‌) సంయుక్తంగా చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. యాజమాన్యం, కార్మికులను సమన్వయం చేయడంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు టీజీబీకేఎస్‌ వర్గాలు వెల్లడించాయి. మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ సీఎండీ శ్రీధర్‌ అధికారులతో సమీక్షిస్తూ తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సంస్థలో 44 వేల మంది కార్మికులు ఉన్నారు. సింగరేణివ్యాప్తంగా ప్రస్తుతం 2,308 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, వారిలో 783 మంది కార్మికులు, 1,121 మంది కార్మి క కుటుంబీకులు, 364 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబాల్లో 27 వేల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి కాగా, మరో 50 వేల మందికి వేయాల్సి ఉంది.  

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.38 కోట్లు 
కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న 867 మందికి హై దరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం రూ.38 కోట్లు వెచ్చించింది. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కొనుగోలు, సింగరేణి ఆసుపత్రుల్లో 1,400 బెడ్లతో ప్రత్యేక కరోనా వార్డుల ఏర్పాటుకు రూ.3.16 కోట్లు ఖర్చు చేసింది. 1.2 లక్షలకు పైగా టెస్టింగ్‌ కిట్లు కొనుగోలు చేయగా, ఇప్పటివరకు 90 వేల మందికి పైగా కార్మికులు, వారి కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డులు, ఐసోలేషన్‌ సెంటర్లలో చేరిన 9,650 మంది పూర్తిగా కోలుకోగా, రూ.80 లక్షల ఖర్చుతో వివిధ మందులు, ఆక్సీమీటర్లు వంటి 18 వస్తువులతో కూడిన కిట్లను హోం ఐసోలేషన్‌ వారికి అందజేశారు. సింగరేణి లో అవసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, ఇతర మందులను రూ.5.55 కోట్లతో సమకూర్చారు.
 
ఐదు చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి 
రూ.3.6 కోట్లతో ఐదు చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి కేం ద్రాలు ఏర్పాటు చేశారు. రూ.1.18 కోట్లతో 370 ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేశారు. కోవిడ్‌ వార్డుల్లో పనిచేసేందుకు 35 మంది అదనపు డాక్ట ర్లు, 126 మంది నర్సులు, 260 మంది సిబ్బందిని కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించారు. రోగులకు పౌష్టికాహారం అందిచేందుకు రూ.1.5 కోట్లు వెచ్చించడంతో పాటు సంస్థలో పనిచేసే వారికి శానిటైజర్, మాస్కులు, పీపీపీ కిట్లు అందజేశారు. కోవిడ్‌తో మృతి చెందిన 39 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారు.

సత్ఫలితాలు సాధించాం
కరోనా నుంచి సింగరేణీయులందరినీ కాపాడుకునేందుకు అంతా సమష్టిగా పనిచేయాలని సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌.బలరాం పిలుపునిచ్చారు. ఏడాదిగా సీఎండీ మార్గనిర్దేశంలో కోవిడ్‌పై సాగిస్తున్న పోరాటంలో సత్ఫలితాలను సాధించామన్నారు.

మెరుగైన సేవలు అందేలా చూస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత 
కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, కార్మికులను సమన్వయం చేస్తూ రోగులకు అండగా ఉంటున్నాం. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు, క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్‌ పక్రియ వరకు అన్ని దశల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం క్రియాశీలకంగా పని చేస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-05-2021
May 16, 2021, 06:31 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల్లో మ్యుకోర్‌మైకోసిన్‌ అనే అరుదైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంపై ఎయిమ్స్‌ చీఫ్‌...
16-05-2021
May 16, 2021, 06:24 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ వైఖరిని విమర్శిస్తూ పోస్టర్లు వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 25...
16-05-2021
May 16, 2021, 06:07 IST
కరోనాకు ముందు డేటింగ్‌ యాప్‌లకు మంచి డిమాండ్‌ ఉండేది. టిండర్‌ లాంటి డేటింగ్‌ యాప్‌ యూజర్లంతా తమ జీవిత భాగస్వామి...
16-05-2021
May 16, 2021, 05:53 IST
ఆమె ముఖంలోని రెండు కళ్లు  సరిగా చూడలేవు.. ఆమె మనో నేత్రం ప్రపంచాన్ని చూడగలదు.. సాటివారి ఇబ్బందులను తెలుసుకోగలదు.. వారికి...
16-05-2021
May 16, 2021, 05:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని, ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలున్న వారిపై నిరంతరం పర్యవేక్షణ...
16-05-2021
May 16, 2021, 04:54 IST
సాక్షి, హైదరాబాద్‌:  బ్లాక్‌ ఫంగస్‌.. కోవిడ్‌ బారినపడి చికిత్స పొందుతున్న కొందరిలో తలెత్తుతున్న సమస్య ఇది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికీ...
16-05-2021
May 16, 2021, 04:21 IST
కారంపూడి (మాచర్ల): కోవిడ్‌ నుంచి ప్రజలను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరం విధుల్లో నిమగ్నమవుతూ...
16-05-2021
May 16, 2021, 03:26 IST
కాప్రా:  కరోనా ఉందనే అనుమానంతో ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో.. ఓ నిండు గర్భిణి అంబులెన్సులోనే మృతి చెందిన ఘటనపై మేడ్చల్‌ మల్కాజిగిరి...
16-05-2021
May 16, 2021, 03:08 IST
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో పల్లెటూళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మే 7వ తేదీ నుంచి...
16-05-2021
May 16, 2021, 03:07 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దానికదే వ్యాపించడం మొదలైందా? పరిశోధనలు చేస్తుండగా పొరపాటున లీకైందా? ఎవరైనా జన్యుమార్పిడి చేసి జీవాయుధంగా...
16-05-2021
May 16, 2021, 02:38 IST
సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో కరోనా వైరస్‌ ఆనవాళ్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. నాచారం...
16-05-2021
May 16, 2021, 02:10 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల షాపింగ్‌ వైఖరిలో గణనీయంగా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలలో మార్కెట్‌...
16-05-2021
May 16, 2021, 01:49 IST
సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌లో ఇంకో టీకా అందుబాటులోకి వచ్చేసింది. రష్యాలోని గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన...
16-05-2021
May 16, 2021, 01:41 IST
న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ను తీసుకోవద్దని, ఆక్సిజన్‌ స్థాయి 94కు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో...
16-05-2021
May 16, 2021, 01:31 IST
కరోనా కల్లోలంతో కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇన్నాళ్లూ సంతోషంగా గడిపిన కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇంటికి ఆధారమైన కుటుంబ పెద్దను కోల్పోయిన ఆవేదన ఓ వైపు.....
16-05-2021
May 16, 2021, 00:39 IST
ముంబై : ముంబై మహా నగరంలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం ముంబైలో 1,450 కేసులు మాత్రమే నమోదయ్యాయి....
16-05-2021
May 16, 2021, 00:02 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోమారు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జామ్ నగర్...
16-05-2021
May 16, 2021, 00:00 IST
జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, విరేచనాలూ, వాంతులూ... ఇలా మనలో నిత్యం కనిపించే సాధారణ లక్షణాలు ఏవి కనిపించినా అది కరోనాకు...
15-05-2021
May 15, 2021, 19:49 IST
జెనివా: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దేశంలో విలయం సృష్టిస్తోంది. రోజుకు లక్షల కొద్ది కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక మహమ్మారి...
15-05-2021
May 15, 2021, 18:49 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 89,535 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,517 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,11,320...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top