‘శంషాబాద్‌’కు ఇంధన పొదుపు అవార్డు  | Shamshabad International Airport Won Telangana State Energy Saving Gold Award | Sakshi
Sakshi News home page

‘శంషాబాద్‌’కు ఇంధన పొదుపు అవార్డు 

Jan 4 2022 5:14 AM | Updated on Jan 4 2022 8:31 AM

Shamshabad International Airport Won Telangana State Energy Saving Gold Award - Sakshi

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్‌ అవార్డును గెలుచుకుంది. ప్రభుత్వం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలో జరిగిన వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జీఎంఆర్‌ ప్రతినిధులకు అవార్డును అందజేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

ఇంధన, జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ముందు వరుసలో ఉందని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకుందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement